తాజాగా సీఏఐటీ (ఆల్ ఇండియా ట్రేడర్స్ సమాఖ్య) సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్‌కు వివిధ పార్టీల నేతలు కలిశారు. చైనా గేమ్‌పై నిషేదం విధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ తరుణంలో బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా "భారత సార్వభౌమత్వానికి, దేశ భద్రతకు ముప్పు మాత్రమే కాదు, యువ తరాలకు హానికరం. గతేడాది నిషేదించిన పబ్జీ ఇప్పుడు భారత చట్టాల్ని అధిగమించి దొడ్డిదారిన ఎంట్రీ ఇస్తోందని ప్రవీణ్ ఖండేల్వాల్ ట్వీట్ చేశారు.
దీనిపై పలువురు నెటిజన్లు తమదైన స్టైల్లో అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. పబ్జీ గేమ్‌ను బ్యాన్ చేయాలని నాడు కేంద్రానికి లేఖ రాసిన అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే నినోంగ్ ఎరింగ్ నుంచి తెలంగాణ ఎంపీ ధర్మపురి అరవింద్ పాటు పలు పార్టీల నేతలు బీజీఎంఐ గేమ్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే ప్రస్తుత నిబంధనల రీత్యా ప్రభుత్వం క్రాఫ్టన్ గేమ్ బ్యాన్ అంశాన్ని పట‍్టించుకునే అవకాశం లేదని అంటున్నారు.