డాక్యుమెంట్స్ లేకుండా ఏ వివరాలను అప్‌డేట్ చేయొచ్చో ట్విట్టర్‌లో తెలిపింది. ఆధార్ కార్డులో ఫోటోగ్రాఫ్, బయోమెట్రిక్స్, జెండర్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ అప్‌డేట్ చేయడానికి మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
కేవలం మీ ఆధార్ కార్డు తీసుకొని మీకు దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్తే చాలు. మీ వివరాలు అప్‌డేట్ చేయించుకునే వీలుంటుంది. ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా అడ్రస్ అప్‌డేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది యూఐడీఏఐ. కానీ మీ వివరాలు అప్‌డేట్ చేయించాలంటే ఆధార్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే స్లాట్ బుక్ చేసుకోవచ్చునని యూఐడీఏఐ తెలిపింది.