భారత్‌లోకి మోటో జీ9 ఫోన్... ధర: రూ.11,499లు

సోమవారం, 24 ఆగస్టు 2020 (18:52 IST)
Moto
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ మోటరోలా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోటో జీ9ను భారత్‌లో విడుదల చేశారు. మోటో G8కి అప్ గ్రేడ్ వెర్షన్‌గా వస్తున్న ఈ ఫోన్ 6.5-అంగుళాల పెద్ద డిస్‌ప్లే, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌, 20డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. భారత్‌ మార్కెట్‌లో రెడ్‌మి నోట్ 9 ప్రో, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21, రియల్‌మి 6i వంటి ఫోన్లకు గట్టి పోటీని ఇవ్వడానికి ఈ ఫోన్ అందుబాటులో వుంది. 
 
మోటరోలా కంపెనీ భారత్‌లో మోటో జీ9 స్మార్ట్‌ఫోన్‌‌ను కేవలం ఒకే ఒక వేరియంట్‌లో విడుదల చేసింది. 4జీబీ ర్యామ్ ప్లస్, 64జీబీ స్టోరేజ్ వంటి సింగల్ వేరియంట్‌లో లభించే ఫోన్ ధర: 11,499 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫారెస్ట్ గ్రీన్, నీలమణి బ్లూ వంటి రెండు కలర్ ఎంపికలలో సంస్థ విడుదల చేస్తున్నది. వీటిని ఆగస్టు 31 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు