ఒప్పో నుంచి ఎఫ్ 19 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్.. ఏప్రిల్ 6న విడుదల

శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (14:02 IST)
OPPO F19
మొబైల్ ప్రియులను ఆకట్టుకునేందుకు ఒప్పో సరికొత్త ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. గత నెలలోనే ఎఫ్ 19 ప్రో, ఎఫ్ 19 ప్రో ప్లస్​ స్మార్ట్​ఫోన్లను విడుదల చేసిన ఒప్పో.. తాజాగా, ఎఫ్-19 పేరుతో మూడో స్మార్ట్‌ఫోన్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్​ఫోన్​ను భారత మార్కెట్​లో ఏప్రిల్ 6న​ విడుదల చేయనుంది. బడ్జెట్​ రేంజ్​లోనే దీనిలో అద్భుతమైన ఫీచర్లను అందించింది. 
 
ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​లో ఒప్పో ఎఫ్​ 19 ఫీచర్లను వెల్లడించారు. దీనిలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరాలు, హోల్-పంచ్ డిస్​ప్లే డిజైన్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్​ఫోన్​ భారత్​తో పాటు శ్రీలంకలో కూడా విడుదల కానుంది.
 
ఒప్పో ఎఫ్ 19 ఇండియా వేరియంట్ ఫుల్​-హెచ్‌డి ప్లస్​ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుందని, ఇది 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. దీనిలోని బ్యాటరీతో కేవలం 72 నిమిషాల్లోనే ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. 
 
ఈ స్మార్ట్​ఫోన్​ 33డబ్ల్యూ ఫ్లాష్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి కూడా సపోర్ట్​ ఇస్తుంది. ఈ టెక్నాలజీతో కేవలం ఐదు నిమిషాల ఛార్జింగ్​తో 5.55 గంటల వాయిస్ కాలింగ్ లేదా రెండు గంటల యూట్యూబ్​ యాక్సెస్​ చేయవచ్చు. ఇక, కెమెరా విషయానికి వస్తే.. ఒప్పో ఎఫ్ 19 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు