ఒప్పో నుంచి కొత్త ఫోన్.. 5జీ సపోర్ట్, 4 కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో..

గురువారం, 21 మే 2020 (18:31 IST)
Oppo Find X2 Neo
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి రానుంది. 5జీ నెట్‌ వర్క్‌తో సపోర్ట్ చేసే ఈ ఫోన్ ధరను రూ.58,000గా కంపెనీ నిర్ణయించింది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో పేరుతో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
 
ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎక్స్ 2 సిరీస్‌లో ఈ ఫోన్ నాలుగోది. ఇప్పటికే ఒప్పో ఫైండ్ ఎక్స్ 2, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 లైట్ ఫోన్లు మార్కెట్లోకి వచ్చేశాయి. తాజాగా విడుదలైన ఒప్పో ఫైండ్ ఎక్స్ 2లో క్వాడ్‌ కెమెరా, ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ అనే ఫీచర్లు వున్నాయి. వెనుకవైపు నాలుగు కెమెరాలను ఈ ఫోన్ కలిగివుంటుంది. 
 
ఇంకా.. ఆండ్రాయిడ్ 10-బేస్డ్ కలర్ ఓఎస్ 7, క్వాల్కమ్ స్నాప్‌ డ్రాగన్ 765జీ సాక్‌, 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 6.5 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, 2400 x 1080 రిజల్యూషన్, 4025 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగివుంది. 
 
కెమెరా పిక్సెల్స్ సంగతికి వస్తే..?
48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
13 మెగాపిక్సెల్ టెలీఫొటో కెమెరా 
 
8 మెగాపిక్సెల్ వైడ్‌ యాంగిల్‌ షూటర్‌
2 మెగాపిక్సెల్ షూటర్‌  
32 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు