ఫేస్‌బుక్‌లో ఫోటోలను అప్‌లోడ్ చేస్తే ఫైన్... ఎక్కడ?

ఆదివారం, 21 జనవరి 2018 (10:21 IST)
ఫేస్‌బుక్, ట్విట్టర్ సోషల్ మీడియాలు జీవితంలో సర్వసాధారణమయ్యాయి. ఈ రెండు ఖాతాలు లేనివారు లేరనే చెప్పొచ్చు. అభిప్రాయాలు,జ్ఞాపకాలు ఇతరులతో పంచుకునేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి. ఇష్టమైన వారితో కలసి మనం దిగిన ఫొటోలను ట్వీటర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తుంటాం. మన జ్ఞాపకాలు, మనం చేసిన చిలిపి పనులను మనకు సంబంధించిన వారికి తెలియజేయాలనే ఆనందంతో ఇలా పెడుతుంటారు.
 
ఇలాగే ఓ తల్లి కూడా తన కొడుకు ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టింది. అయితే అది కాస్తా సీరియస్ అయ్యింది. ఎందుకంటే ఆ కన్న కొడుకు తల్లిపై కోర్టుకెక్కాడు. తన పర్మిషన్ లేకుండా ఫేస్‌బుక్‌లో ఫొటోలను అప్‌లోడ్‌ చేసిందంటూ కోర్టులో కేసు వేశాడు. తన తల్లి ఎప్పుడూ ఫేస్‌బుక్‌లో తన ఫొటోలు పెడుతోందని ఇటలీకి చెందిన 16 ఏళ్ల బాలుడు గతేడాది డిసెంబర్‌ 23న కోర్టులో కేసు వేశాడు. 
 
ఈ ఫొటోల కారణంగా తన సామాజిక సంబంధాలు దెబ్బతిన్నాయని, దీంతో అమెరికాకు వెళ్లి చదువుకోవాలని భావిస్తున్నట్లు తెలిపాడు. దీంతో ఆ ఫొటోలన్నింటినీ 2018 ఫిబ్రవరి 1లోగా తొలగించాలని.. లేకపోతే దాదాపు రూ.7.8 లక్షలు జరిమానా కట్టాల్సి ఉంటుందని రోమ్‌లోని కోర్టు జడ్జి మోనికా వెల్లెట్టి తీర్పునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు