భారతదేశంలో POCO M7 5G.. ఫీచర్లు, ధరలు గురించి తెలుసా?

సెల్వి

సోమవారం, 3 మార్చి 2025 (20:08 IST)
POCO M7 5G
పోకో సంస్థ భారతదేశంలో POCO M7 5Gని ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌తో 6.88-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. 8GB వరకు RAMని అందిస్తుంది. అదనపు విస్తరణ ఎంపిక 12GB వరకు ఉంటుంది. 
జియోమీ హైపర్ ఓఎస్‌తో ఆండ్రాయిడ్ 14పై నడుస్తున్న పోకో తాజాగా విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌లో సోనీ IMX852 సెన్సార్‌ను ఉపయోగించి 50MP ప్రైమరీ కెమెరా అమర్చబడి మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దానితో పాటు సెకండరీ కెమెరా కూడా ఉంది. నాచ్ లోపల 8MP ఫ్రంట్ కెమెరా ఉంచబడింది.
 
POCO M7 5G స్పెసిఫికేషన్లు: - డిస్ప్లే: 
6.88-అంగుళాల HD+ (1600 x 720) 120Hz రిఫ్రెష్ రేట్‌తో, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, TÜV రీన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ మరియు ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్‌లు - ప్రాసెసర్: అడ్రినో 613 GPUతో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 (4nm)
 
RAM - స్టోరేజ్: 6GB/8GB LPDDR4X RAM, 128GB UFS 2.2 స్టోరేజ్, మైక్రో SD ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్: Xiaomi HyperOS తో Android 14 - SIM అండ్ కనెక్టివిటీ: డ్యూయల్ సిమ్ (నానో + నానో + మైక్రో SD), 5G (SA/NSA), డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.0, GPS, USB టైప్-C
 
POCO M7 5G శాటిన్ బ్లాక్, మింట్ గ్రీన్, ఓషన్ బ్లూ రంగులలో లభిస్తుంది. మొదటి రోజు ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా 6GB + 128GB వేరియంట్ ధర రూ.9,999 కాగా, 8GB + 128GB మోడల్ ధర రూ.10,999. మార్చి 7 మధ్యాహ్నం నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభ అమ్మకం తర్వాత, ధరలు వరుసగా రూ.10,499, రూ.11,499కి పెరుగుతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు