పబ్జీ న్యూ స్టేట్ గేమ్ యూజర్లకు అద్బుతమైన గేమింగ్ ఎక్స్పీరియన్స్ అందించనుంది. ఇది పబ్జీ లేదా BGMI వలే విజయం సాధించే అవకాశం ఉంది. ఈ గేమ్ ట్రాయ్ అనే కొత్త మ్యాప్‌తో వస్తుంది. మెరుగైన గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం దీనిలో డ్రోన్‌లు, వెరైటీ వెపన్స్, గన్స్‌ను అందుబాటులోకి తేనున్నారు.
అంతేకాదు, సరికొత్త రేసింగ్ వాహనాలను తీసుకువస్తామని కాఫ్టన్ యూజర్లకు హామీ ఇచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన క్రాఫ్టన్ సంస్థ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో పబ్జీ తరహా గేమ్‌ను లాంచ్ చేసింది. ఈ గేమ్‌కు అంతా ఊహించినట్లుగానే అద్భుతమైన స్పందన వస్తోంది. తక్కువ వ్యవధిలోనే మిలియన్ల కొద్ది డౌన్లోడ్స్ను సొంతం చేసుకుంది.
అద్భుతమైన గ్రాఫిక్స్‌తో రూపొందిన న్యూ స్టేట్ పబ్జీ ఇండియా గేమ్ ప్రీ-రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి నెలలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లో ఈ గేమ్ ఏప్రిల్ నాటికి 10 మిలియన్ల డౌన్లోడ్స్ను అందుకుంది. అయితే, భారత్‌లో ఆంక్షల నేపథ్యంలో దీని విడుదల ఇక్కడ ఆలస్యమైంది.