నార్జో 30ఏ స్మార్ట్ ఫోన్.. రివర్స్ ఛార్జింగ్.. స్పెసిఫికేషన్స్..

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (22:15 IST)
Realme Narzo 30A
రియల్‌మీ సంస్థ నుంచి రియల్‌మీ నార్జో 30ఏ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి విడుదలైంది. ఈ ఫోన్ వివరాల్లోకి వెళితే.. నార్జో 30ఏ స్మార్ట్ ఫోన్ మోడల్‌లో6.5 ఇంచ్‌ల హెచ్డీ ప్లస్ 720x1600 పిక్సల్ డిస్‌ప్లే, మీడియా టెక్ హీలియో జీ 85 ప్రాసెసర్, 4జీబీ రామ్, 64 జీబీ మెమరీ, 13 ఎంబీ ప్రైమరీ కెమెరా, 8 ఎంబీ సెల్ఫీ కెమెరా, 4జీ ఎల్డీఈ, వైఫై, బ్లూటూత్ 5, యూఎస్బీ టైప్ సి బోర్డ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సదుపాయాలను కలిగి వుంటుంది. 
 
ధర వివరాలు :
నార్జో 30ఏ స్మార్ట్ ఫోన్ 3జీబీ రామ్, 32 జీబీ మెమరీ మోడల్ ధర  రూ. 8,999
నార్జో 30ఏ స్మార్ట్ ఫోన్ 4జీబీ రామ్, 64 జీబీ మెమరీ మోడల్ ధర రూ. 9,999.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు