రూ. 6000కే స్మార్ట్ ఫోన్... 2 సంవత్సరాల వారెంటీతో... కావాలనుకుంటున్నారా?

గురువారం, 4 జులై 2019 (15:09 IST)
భారతీయ మొబైల్ మార్కెట్‌లో షియోమీ సంస్థ సరికొత్త మొబైల్‌లను ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరో కొత్త మొబైల్‌ను రిలీజ్ చేసింది. అది రెడ్‌మీ 7ఎ. ఈ మొబైల్‌కి సంబంధించి షియోమీ సంస్థ రెండు సంవత్సరాల వారెంటీని అందిస్తుంది.
 
రెడ్‌మీ 7ఎ ప్రత్యేకతలు:
* 5.45 అంగుళాల హెచ్‌డి+ డిస్లే
* స్నాప్‌డ్రాగన్ 439 ఆక్టాకోర్ ప్రాసెసర్,
* 12 మెగా పిక్సెల్‌ల బ్యాక్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా,
* 2 జీబీ ర్యామ్, 16 జీబీ, 32 జీబీ స్టోరేజీ వేరియంట్‌లలో లభ్యం,
* డ్యుయల్ సిమ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమొరీ,
* 2 సంవత్సరాల ఫోన్ వారెంటీ,
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కలదు.
*ధర: 2జీబీ 16 జీబీ ఫోన్ ధర రూ.5999 కాగా, 2జీబీ 32 జీబీ ఫోన్ ధర రూ. 6199గా సంస్థ నిర్ణయించింది. 
 
కాగా జూలై మాసంలో ఈ ఫోన్ కొన్న వారికి రెండు వందల రూపాయలు తగ్గింపును అందిస్తున్నారు. బడ్జెట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారు ఈ ఫోన్‌ని కొనుగోలు చేస్తే సరి..

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు