జియో మరో ధమాకా... ఇకపై డైరెక్టుగా వైఫై కాల్స్... విలేజ్‌లోనూ ఫుల్ సిగ్నల్స్

మంగళవారం, 21 మే 2019 (14:46 IST)
జియో నెట్వర్క్ ప్రత్యర్థి నెట్వర్క్ సంస్థలను నిద్రపోనివ్వడంలేదు. ఏం విషయంలో అనకుంటున్నారూ? వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడంలో. జియో తాజా ప్లాన్ చూస్తుంటే ఇక ప్రత్యర్థి నెట్వర్క్ సంస్థలకు చుక్కలు కనబడక తప్పదు. ఇప్పటికే ఇండియన్ టెలికం పరిశ్రమ రూపురేఖలను మార్చేసిన రిలయన్స్ జియో... ఇప్పుడు మరో ఘనత దక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది.
 
సెల్యూలర్ నెట్వర్కుతో సంబంధం లేకుండా వీవో‌వై-ఫై (వాయిస్ ఓవర్ వై-ఫై) సేవల ద్వారా వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ తదితర రాష్ట్రాల్లో ఈ సేవలను ప్రవేశపెట్టేందుకు పరీక్షలు చేస్తోంది. 
 
ఈ క్రమంలో కొంతమంది ఫోన్లలో వీవో వై-ఫై చిహ్నం కనిపిస్తోంది. అంటే... మరికొన్ని రోజుల్లోనే సెల్యూలర్ నెట్వర్కులతో సంబంధం లేకుండా వైఫైతో హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు. దీనితో సిగ్నల్ అందుబాటులో లేకపోవడం వంటి సమస్య ఎదురయ్యే పరిస్థితి వుండదు. ఇది కనుక సక్సెస్ అయితే ప్రత్యర్థి నెట్వర్కులకు మరోసారి చుక్కలు కనిపిస్తాయి మరి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు