రెడ్‌మి నోట్ 7 పైన పుకార్లు... ఐతే...

గురువారం, 14 ఫిబ్రవరి 2019 (15:26 IST)
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి తాజా ఉత్పత్తి రెడ్‌మి నోట్ 7 స్మార్ట్‌ఫోన్ గురించి మార్కెట్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఫోన్ లాంచ్ తేదీ మార్చికి వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కంపెనీ ఆ వార్తలను ఖండించింది. ఇందు కోసం ట్విట్టర్‌లో ట్వీట్ కూడా చేసింది. దీని ప్రకారం ఫోన్ మార్చిలో కాకుండా ఫిబ్రవరి నెలలోనే లాంచ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. 
 
రెడ్‌మి నోట్ 7ని ముందుగా చైనాలో లాంచ్ చేసారు. దీని ప్రారంభ ధర 999 చైనా యువాన్‌లుగా (దాదాపు రూ.10,300) నిర్ణయించారు. భారత్‌లో లాంచ్ చేయడానికి సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టింది. ట్వీట్‌లో పేర్కొన్న ప్రకారం ఫిబ్రవరి 28, 2019న లాంచ్ చేయనుంది.
 
షియోమీ రెడ్‌మి నోట్ 7 ఫీచర్లు:
డ్యుయెల్ సిమ్ స్మార్ట్‌ఫోన్
MIUI 9 ఆధారిత ఆండ్రాయిడ్ ఓరియోపై పని చేస్తుంది.
6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ LTPS డిస్‌ప్లే.
1080x2340 పిక్సెల్ రిజల్యూషన్, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
కార్నింగ్ గొరిల్లా గ్లాస్, 2.5D కర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ అమర్చబడి ఉంది.
2.2GHz స్నాప్‌డ్రాగన్ 660 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది.
3జీబీ, 4జీబీ, 6జీబీ ర్యామ్ వేరియంట్‌లలో లభ్యం కానుంది.
32, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో పాటు అందుబాటులోకి రానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు