అత్యధిక వేగంతో డేటాను అందించే నెట్‌వర్క్‌గా రిలయన్స్ జియో వరుసగా ఏడోసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ ఈ విషయాన్ని వెల్లడించింది. సెప్టెంబర్ 5, 2016న సేవలను ప్రారంభించిన జియో నేటితో ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది.
ట్రాయ్ నిర్దేశించిన ప్రమాణాలతో డేటాను అందిస్తున్న వాటిలో జియో తర్వాత స్థానంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు నిలిచాయి. జులై నెలకుగాను 18.331 ఎంబీపీఎస్ వేగంతో డేటాను జియో నెట్‌వర్క్ నుంచి వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు.
ఎయిర్‌టెల్ 8.833 ఎంబీపీఎస్, ఐడియా సెల్యులార్ 8.833, వొడాఫోన్ (ఇండియా) 9.325 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను కలిగి ఉన్నాయి. ఏడాది కాలంలో డేటా వినియోగం 20 కోట్ల జీబీ నుంచి 150 కోట్ల జీబీకి చేరింది. ఒక్క జియో నుంచే నెలకు 100జీబీ డేటాను వినియోగిస్తున్నట్లు సమాచారం.