ఎయిర్ టెల్ వన్ ఇయర్ ప్లాన్స్ :
ఇటీవల ఎయిర్ టెల్ ఏడాది రీఛార్జ్‌కు సంబంధించిన కొత్త ప్లాన్స్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తద్వారా ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.1,498 రీఛార్జ్ చేస్తే.. 1జీబీ అన్ లిమిటెడ్ 4జీ సేవలు లభిస్తాయి. అంటే నెలకు రూ.51లు మాత్రమే చెల్లించినట్లవుతుంది.
రిలయన్స్ జియో నుంచి 60 జీబీ :
రిలయన్స్ జియో ప్లాన్స్ విషయానికి వస్తే.. రూ.400లకు 60 జీబీ అన్ లిమిటెడ్ 4జీ సేవలను ఇస్తోంది. ఈ ఆఫర్ 30 రోజులకు మాత్రమే వర్తిస్తుంది.
ఎయిర్ టెల్, వొడాఫోన్ :
ఎయిర్ టెల్, వొడాఫోన్ ఆఫర్లలో ఉచిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్ స్కీమ్‌లుండవు. రిలయన్స్ జియోలో వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లతో పాటు నెలసరి ఉచిత డేటా లభిస్తుంది. కానీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఆఫర్లలో వాయిస్ కాల్స్‌కు, ఎస్సెమ్మెస్‌లకు నగదు చెల్లించాల్సి వుంటుంది. సో.. జియో-ఎయిర్‌టెల్- వొడాఫోన్ డేటా ప్లాన్లలో జియోనే బెస్ట్ కదూ..