దేశంలో అగ్రగామిగా ఉన్న ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తాజా మరో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం చేసే సిబ్బందికి ఎంతో అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. ఈ ప్లాన్ ధర రూ.444. కాలపరిమితి 56 రోజులు. ఇతర టెలికాం కంపెనీలు అందిస్తున్న ప్లాన్లతో పోలిస్తే ఇది చాలా మంచిదని అని జియో చెబుతోంది.
ఈ డేటా అయిపోయిన తర్వాత 64 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్‌ను వినియోగదారులు వాడుకోవచ్చు. పైగా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే, అన్ని జియో యాప్‌లను ఉచితంగా వినియోగించవచ్చు. అందుకే ఈ ప్లాన్ వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని రిలయన్స్ జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.