చిన్నప్పుడు స్కూళ్ళకు సెలవులు ఇస్తే.. ఎంత సరదాగా గడుపుతామో కరోనాటైంలో లాక్‌డౌన్‌లో నేను, నా తమ్ముడు.. స్నేహితులతో ఆడుకోవడం, డాన్స్‌లు వేయడం.. వంటివి సమ్మర్ హాలీడేస్‌లా అనిపించాయని కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలియజేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన సినిమా `అల్లుడు అదుర్స్`. ఈ నెల 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా వెబ్ దునియా ఆయనతో జరిపిన ఇంటర్వూ విశేషాలు.
15వ తేదీ నుంచి 14కు ఒకరోజు ముందు విడుదలకు వచ్చారు?
అవును. మన సంక్రాంతి అనేది అల్లుల్ల పండుగ. అందరూ ఆరోజే వస్తారు. ఇదే విషయాన్ని.. పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు..అనుకుని 14నే వస్తే బాగుంటుందని.. అలా ఫిక్స్ చేశారు.
ఈ కథ విన్నప్పుడు ఎలా అనిపించింది?
నేను రొటీన్ కథలు కాకుండా.. నాకంటూ నేను నిరూపించుకునేందుకు చాలా అవకాశం మున్న కథగా అనిపించింది. ఇదొక సవాల్‌గా స్వీకరించాను. చాలా కథలు విన్నాను. ఒకసారి సంతోష్ వచ్చి. ఒక పాయింట్ చెప్పాడు. అది వినగానే సెకండాఫ్ చాలా నచ్చింది. అప్పటికీ అజయ్‌దేవ్‌గన్.. గోల్‌మాల్.. చూశాను. ఇందులో హ్రరర్ ఎపిసోడ్ చాలా హైలైట్‌గా వుంటుంది.
హర్రర్.. కథలోని భాగమా?
అవును. ఏదో కావాలని పెట్టింది కాదు. కథలో ఓ భాగం. చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు.
పిల్లలకు హార్రర్‌కు సంబంధం ఏమిటి?
చిన్నపిల్లలే హర్రర్ బాగా ఎంజాయ్ చేస్తారు. నా స్నేహితుల పిల్లలు చూస్తే.. వారు బాగా ఎంజాయ్ చేస్తుంటారు ఇలాంటి సినిమాలు చూసి. చిన్నతనంలో.. నేను కూడా ఎంజాయ్ చేశా. `ఈవెల్ డెడ్` సినిమా చాలా సార్లు చూశా. ఒకవైపు భయపడినట్లే అనిపిస్తుంది. మరోవైపు కామెడీగా వుంటుంది.
ఆ ఎపిసోడ్ ట్రైనింగ్ తీసుకున్నారా?
హర్రర్ సినిమాలకు పిన్ టు పిన్ చాలా జాగ్రత్త గా చేయాలి. అందుకే సప్తగిరితోపాటు నేను కూడా తెల్లవారు జామున 5 గంటలకే రిహాల్సర్స చేసేవాళ్ళం. ఎక్కడా తేడా వచ్చినా.. సీన్ అంతా దెబ్బ తింటుంది..
ఈ సినిమాలో డాన్స్ బాగా వేశారే?
అవును. ఇంతకుముందు సీత, రాక్షసుడు సినిమాల్లో ఆ అవకాశం కలగలేదు. అందుకే చాలా కసితో డాన్స్ వేశా. సెట్‌లోకి రాగానే.. మంచి ఊపు వచ్చింది. ఇందులో కొత్తగా ఓ పాట వుండాలని విజువల్ ట్రీట్ వుండాలని.. కశ్మీర్‌లో కూడా వెళ్ళిచేశాం.
అక్కడ తుపానులో ఇరుక్కుపోయారని తెలిసింది?
అవును. అక్కడ షూటింగ్ చేస్తుండగా.. చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం. పాట పూర్తయ్యాక మంచు తుఫాన్ వచ్చింది. దాన్ని నుంచి బయట పడడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ దేవుడే.. మమ్మల్ని.. తీసుకు వచ్చాడు.
లాక్‌డౌన్‌లో ఏం నేర్చుకున్నారు?
లాక్‌డౌన్లో పూర్తిగా ఇంటిలోనే గడిపాను. అమ్మ వంటకం.. పప్పన్నం, రోటి చట్నీ, పెరుగు అన్నం.. ఇవన్నీ తిని చాలా రోజులైంది. అవన్నీ.. తినడం చాలా హ్యపీగా వుంది. కుటుంబంతో గడపడం.. స్నేహితులతో ఆటలు, చెస్.. క్రికెట్, టెన్నిస్. ఇలా అన్ని ఆటలు ఆడేశాను. ఒకరకంగా స్కూల్ డేస్ తర్వాత సమ్మర్ హాలీడేస్‌లా అనిపించాయి.
ఛత్రపతి ద్వారా బాలీవుడ్‌కు వెళుతున్నారు. ఎలా అనిపిస్తుంది?
చాలా ఆనందంగా వుంది. దేవుడు ఇచ్చిన అవకాశంలా వుంది.
ఆల్‌రెడీ ప్రభాస్ చేసిన పాత్ర చేయడం రిస్క్ అనిపించలేదా?
నాకు చాలెంజ్ అంటే ఇష్టం. ఈ సినిమాను చాలెంజింగ్‌గా స్వీకరిస్తున్నా.