జియో 4జీ ల్యాప్‌టాప్.. ఫీచర్స్ ఇవే.. ధర మాత్రం సస్పెన్స్...

శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (12:13 IST)
దేశీయ టెలికాం రంగాన్ని ఓ కుదుపుకుదుపుతున్న రిలయన్స్ జియో తాజాగా ల్యాప్‌టాప్‌లను కూడా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. అదీ కూడా 4జీ సామర్ధ్యంగల ల్యాప్‌టాప్‌లు కావడం గమనార్హం. ఇవి పూర్తిగా యాపిల్‌ సంస్థకు చెందిన 13.3 అంగుళాల మ్యాక్‌బుక్‌ని పోలి ఉంటుందనే సమాచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
ఇందులోని ఫీచర్లను పరిశీలిస్తే... ఇది హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు, వీడియో కాలింగ్‌ కోసం హెచ్‌డీ కెమెరాతో దీనిని అందుబాటులోకి తీసుకుని రానుంది. ఇందులో 4జీబీ ర్యామ్‌ను అమర్చగా, 128జీబీ స్టోరేజ్‌.. ఇఎంఎంసీ ద్వారా 64 జీబీ వరకూ మెమొరీని పెంచుకునే సదుపాయం కల్పించనున్నట్టు వినికిడి. అంతేకాకుండా, 4జీ, ఎల్‌టీఈ, బ్లూటూత్‌, హెచ్‌డీఎంఐ పోర్ట్‌ సదుపాయంతో పాటు.. రెండు యూఎస్‌బీ పోర్ట్స్‌, మైక్రో ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌ వంటి అత్యాధునిక ఫీచర్లను ఇందులో పొందుపరిచినట్టు తెలుస్తోంది. అయితే, ఈ ల్యాప్‌టాప్‌ల ధరను మాత్రం గోప్యంగా ఉంచింది.

వెబ్దునియా పై చదవండి