మార్చి31 తర్వాత కేవలం రూ.100తో జియో ఆఫర్ కొనసాగింపు.. జూన్ 30 వరకు?

శుక్రవారం, 20 జనవరి 2017 (09:04 IST)
ఉచిత డేటా ప్రకటనతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరో సంచలన ఆఫర్‌తో ముందుకొస్తోంది. మార్చి 31 తర్వాత కూడా జియో నామమాత్రపు రుసుముతో మరో మూడు నెలలపాటు ఉచిత సేవలు కొనసాగించాలని జియో పక్కా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వెల్‌కమ్ ఆఫర్‌తో దేశ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో తర్వాత దానిని మార్చి 31 వరకు పొడిగించి మరోమారు టెలికం రంగాన్ని ఓ కుదుపు కుదిపింది.
 
జియో దెబ్బకు టెలికాం సంస్థలన్నీ దిగి వచ్చి విపరీతమైన టారిఫ్ ప్లాన్‌లను ప్రకటించాయి. తమ వినియోగదారులను నిలపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. మరోవైపు జియో తన వీరవిహారాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే 7.2 కోట్ల మంది ఖాతాదారులను సొంతం చేసుకున్న జియో పది కోట్ల మంది వినియోగదారులే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. 
 
ఇందులో భాగంగా మార్చి 31 తర్వాత కేవలం రూ.100తో ప్రస్తుత ఆఫర్‌ను కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఆఫర్‌ను మరో మూడు నెలలు అంటే జూన్ 30వ తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలిసింది.

వెబ్దునియా పై చదవండి