కిక్ స్టార్ట్ పేరుతో జియో ట్యాక్సీ సేవలను ప్రారంభించనున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను రిలయన్స్ కొట్టిపారేసింది. రిలయన్స్ జియో వారంలోనే ఉబెర్‌తో ఒప్పందం చేసుకోవడం ద్వారా ట్యాక్సీ సేవలను ప్రారంభిస్తుందని నెట్టింట్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉచిత డేటా పేరిట.. రిలయన్స్ జియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో రిలయన్స్ సంస్థ యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలను కూడా ప్రారంభిస్తారనే వార్తలు నెట్లో హలచల్ చేస్తున్నాయి. దీనిపై రిలయన్స్ స్పందిస్తూ ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేసింది. తాము ఎలాంటి యాప్ ఆధారిత సేవలను ప్రారంభించలేదని క్లారిటీ ఇచ్చింది. కిక్‌స్టార్ట్ పేరుతో ట్యాక్సీ సేవలను ప్రారంభిస్తామనేందుకు ప్రణాళికలు ఏవీ లేవని రిలయన్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది.