టెలికాం రంగ సంస్థలు జియో దెబ్బతో వినియోగదారులకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం జియోలో రూ.399తో రీఛార్జ్ చేసుకుంటూ 70 రోజుల వాలిడిటీతో రోజుకు 1జీబీ ఉచిత డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ అందుకునే సౌలభ్యం వుంది.
మరోవైపు వొడాఫోన్ కూడా రూ.496 ప్యాక్ ద్వారా అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్, ఫ్రీ నేషనల్ రోమింగ్, 1 జీబీ డేటాను 84 రోజుల పాటు అందిస్తుంది. అలాగే రూ.177 ప్యాక్ కింద అన్ లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్, 28 రోజుల పాటు 1 జీబీ డేటాను అందిస్తోంది.