స్మార్ట్ ఫోన్ల ధరలు తగ్గించిన శాంసంగ్

ఆదివారం, 10 నవంబరు 2019 (16:19 IST)
ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి కంపెనీల్లో ఒకటైన శాంసంగ్ తన స్మార్ట్ ఫోన్ ధరలను తగ్గించింది. గెలాక్సీ ఎ50ఎస్, ఎ30ఎస్ స్మార్ట్‌ఫోన్లపై ధరలు తగ్గించింది. గెలాక్సీ ఎ30ఎస్‌పై వెయ్యి రూపాయలు, గెలాక్సీ ఎ50ఎస్‌పై మూడు వేల రూపాయల మేరకు తగ్గించినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ ధరల తగ్గింపు నేపథ్యంలో గెలాక్సీ ఎ50ఎస్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.19,999 ధరకు లభిస్తుండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.21,999గా ఉంది. అలాగే గెలాక్సీ ఎ30ఎస్ రూ.15,999 ధరకు లభించనుంది. 
 
ప్రస్తుతం తగ్గిన ధరలకే ఈ ఫోన్లను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. గెలాక్సీ ఎ50ఎస్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, 4/6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 48, 5, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు తదితర ఫీచర్లను అందిస్తోంది. 
 
ఇకపోతే, గెలాక్సీ ఎ30ఎస్‌లో 6.4 ఇంచుల డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 25, 8, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు