ఈ నేపథ్యంలో జైషే మహ్మద్ ఉగ్రవాదులు భారత్‌లో దాడులకు దిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. నిజానికి అయోధ్య తీర్పు వెల్లడి కావడానికి ముందు నుంచే ఉగ్ర సంస్థలు భారత్‌లో భారీ విధ్వంసానికి ప్రణాళికలు వేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వానికి భారత మిలటరీ ఇంటెలిజెన్స్, రా, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి సంస్థలు తెలిపాయి.
దీంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల ప్రతిపాదిత లక్ష్యాలను ముందుగానే పసిగట్టి ఈ దాడులను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉగ్రవాదులు జరపవచ్చని నిఘా సంస్థలు చెప్పాయి.