శ్యామ్‌సంగ్ గాలెక్సీ నోట్ 20- ఆగస్టు 5న వచ్చేస్తోంది..

శనివారం, 6 జూన్ 2020 (13:18 IST)
Samsung Galaxy Note 20
స్మార్ట్ ఫోన్ ప్రియులకు ఓ శుభవార్త. శ్యామ్‌సంగ్ గాలెక్సీ నోట్ 20 ఆగస్టు 5న మార్కెట్లోకి రానుంది. దీనికోసం శ్యామ్‌సంగ్ అన్నీ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అదే రోజున శ్యామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20తో పాటు గెలాక్సీ ఫోల్డ్ 2, గెలాక్సీ వాచ్ 2ను కూడా ఆన్‌లైన్ ఈవెంట్‌లో శ్యామ్‌సంగ్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో శ్యామ్‌సంగ్ ఎలాంటి ఫోన్‌నూ ఆన్‌లైన్‌ ఈవెంట్‌లో విడుదల చేయలేదు. 
 
కోవిడ్-19 ప్రభావం కారణంగా తొలిసారిగా ఈ కొత్త మోడల్స్‌ను ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా విడుదల చేయనుంది. అప్పటికల్లా కోవిడ్-19 అదుపులోకి వస్తే ఏదైనా వేరే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 
గెలాక్సీ నోట్ 20తో పాటు నోట్ 20 అల్ట్రా, గెలాక్సీ ఫోల్డ్ 2, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 జి, గెలాక్సీ టాబ్ ఎస్ 7, గెలాక్సీ టాబ్ ఎస్ 7 +, గెలాక్సీ వాచ్ 2లను కూడా శామ్‌సంగ్ అదే రోజున విడుదల చేయనుందని టాక్. శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రాలో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.87-అంగుళాల క్యూహెచ్‌డి + డిస్‌ప్లే ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు