గెలాక్సీ ఏ06 5జిని విడుదల చేసిన సామ్‌సంగ్ ఇండియా

ఐవీఆర్

గురువారం, 20 ఫిబ్రవరి 2025 (22:59 IST)
గురుగ్రామ్: భారతదేశంలో అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్‌సంగ్, నేడు గెలాక్సీ ఏ06 5జిని విడుదల చేసినట్లు ప్రకటించింది, ఇది సరసమైన ధరకు అద్భుతమైన 5జి అనుభవాన్ని అందిస్తుంది. అత్యంత సరసమైన బడ్జెట్లో గెలాక్సీ ఏ సిరీస్ 5Gజి స్మార్ట్‌ఫోన్‌గా, గెలాక్సీ ఏ06 5జి  వినియోగదారులకు దాని విశ్వసనీయ పనితీరు, మన్నికతో గరిష్ట విలువను అందించడానికి రూపొందించబడింది.
 
ఈరోజు నుండి, గెలాక్సీ ఏ06 5జి భారతదేశంలోని అన్ని రిటైల్ అవుట్‌లెట్‌లలో, సామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో, అలాగే ఇతర ఆఫ్‌లైన్ ఛానెల్‌లలో, బహుళ స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 64జిబి నిల్వతో 4జిబి రామ్ వేరియంట్ కేవలం రూ. 10499 నుండి ప్రారంభ ధరతో గెలాక్సీ ఏ06 5జి మూడు సొగసైన, ఆకర్షణీయమైన రంగులు- నలుపు, బూడిద, లేత ఆకుపచ్చలో వస్తుంది. ప్రత్యేక ఆవిష్కరణ ఆఫర్‌గా, కస్టమర్‌లు కేవలం రూ. 129 వద్ద సామ్‌సంగ్ కేర్+ప్యాకేజీతో ఒక సంవత్సరం స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను పొందవచ్చు, ఇది అదనపు రక్షణ, మనశ్శాంతిని అందిస్తుంది.
 
“గెలాక్సీ ఏ06 5జి విడుదలతో, గొప్ప 5జి అనుభవం కోసం మేము ఈ విభాగంలో అత్యున్నత 12 5జి బ్యాండ్‌లను తీసుకువస్తున్నాము. అద్భుతమైన కనెక్టివిటీ, శక్తివంతమైన పనితీరు, విభాగములో అత్యున్నత ఆవిష్కరణలను అందించడానికి రూపొందించబడిన ఈ పరికరం, అత్యాధునిక సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. ఈ పరికరంతో, వినియోగదారులు పని, వినోదం కోసం హై-స్పీడ్ కనెక్టివిటీని సాటిలేని మన్నికతో పాటు ఆస్వాదించగలరని కూడా మేము నిర్ధారిస్తున్నాము” అని సామ్‌సంగ్ ఇండియా ఎంఎక్స్ బిజినెస్ జనరల్ మేనేజర్ అక్షయ్ ఎస్ రావు అన్నారు.
 
అద్భుతమైన పనితీరు
అన్ని నెట్‌వర్క్ అనుకూలతలు కలిగిన గెలాక్సీ ఏ06 5జి, 12 5G బ్యాండ్‌లకు మద్దతు ఇస్తుంది, అన్ని టెలికాం ఆపరేటర్లలో మెరుగైన నెట్‌వర్క్ కనెక్టివిటీ, వేగం కోసం క్యారియర్ అగ్రిగేషన్‌ను కలిగి ఉంది. MTK D6300 ప్రాసెసర్‌తో నడిచే గెలాక్సీ ఏ06 5జి శక్తివంతమైన పనితీరును నిర్ధారిస్తుంది, మల్టీ టాస్కింగ్, గేమింగ్, స్ట్రీమింగ్‌ను సులభంగా సులభతరం చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ RAM ప్లస్ ఫీచర్‌తో 12జిబి వరకు రామ్‌ని కూడా అందిస్తుంది.
 
అద్భుతమైన కెమెరా, డిస్ప్లే
ఈ పరికరం వేగవంతమైన వివరణాత్మక చిత్రాలను ఒడిసిపట్టటానికి 50ఎంపి ప్రధాన వెనుక కెమెరా, మెరుగైన స్పష్టత కోసం 2ఎంపి డెప్త్ కెమెరాతో అమర్చబడి ఉంటుంది, అయితే 8ఎంపి ముందు కెమెరా అధిక-నాణ్యత సెల్ఫీలు, వీడియో కాల్‌లను నిర్ధారిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 20:9 యాస్పెక్ట్  నిష్పత్తితో దాని విస్తారమైన 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లేతో స్పష్టమైన దృశ్య అనుభవాన్ని నిర్ధారిస్తూ సొగసైన, ఆకర్షణీయమైన డిజైన్‌ను కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది సెగ్మెంట్‌లో అత్యుత్తమ 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు