సరికొత్త పసుపు రంగులో శాంసంగ్ Galaxy Z Flip5 విడుదల

మంగళవారం, 17 అక్టోబరు 2023 (22:27 IST)
పండగ సీజన్ సమయంలో శామ్ సంగ్ వారి అయిదవ తరానికి చెందిన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించే వినియోగదారుల కోసం పసుపు రంగులో (ఎల్లో కలర్)కొత్త Galaxy Z Flip5 గురించి శామ్ సంగ్, భారతదేశంలో అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీ, ఈ రోజు ప్రకటించింది. ఈ ఏడాది పండగ సీజన్లో శామ్ సంగ్ వారి ఉత్తమమైన పాకెట్లో అమరిపోయే డివైజ్ కొనుగోలు చేయడానికి అన్వేషిస్తున్న వినియోగదారులకు కొత్త Galaxy Z Flip5 ఎల్లో మరిన్ని ఆప్షన్స్ అందిస్తుంది.

Galaxy Z Flip5 భారతదేశంలో నాలుగు రంగులలో లభిస్తోంది- మింట్, గ్రాఫైట్, క్రీమ్ మరియు లవేండర్. పునరుత్తేజం కలిగించే కొత్త ఎల్లో, Galaxy Z Flip5 చేరికతో తమ వ్యక్తిగత స్టైల్‌కి అనుకూలమైన మరినని రంగుల ఎంపికలు వినియోగదారులకు ఇప్పుడు అందుబాటులో ఉంటాయి. పండగ స్ఫూర్తికి అనుగుణంగా, శామ్ సంగ్ Galaxy Z Flip5 రకాలలో పరిమిత సమయం ఆకర్షణీయమైన ఆఫర్స్‌ను కూడా ప్రకటించింది. ఈ ఆఫర్స్‌తో, Galaxy Z Flip5 కస్టమర్స్ బ్యాంక్ క్యాష్ బ్యాక్ రూ. 7000 అప్ గ్రేడ్ బోనస్ పొందవచ్చు, ఇది మొత్తంగా రూ. 14000 ప్రయోజనం కలిగిస్తుంది. ప్రత్యామ్నాయంగా, కొత్త వేరియెంట్‌ను 30 నెలల లో-కాస్ట్ EMI రూ. 3379కి బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, HDFC వంటి ప్రధానమైన ఫైనాన్షియర్స్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఆప్షన్ కోరుకోని కస్టమర్స్ తమ కొత్త కొనుగోలుపై నేరుగా రూ. 14000 అప్‌గ్రేడ్ ప్రయోజనం పొందవచ్చు.

స్వీయ వ్యక్తీకరణ కోసం పాకెట్-సైజ్‌లో ఉండే డివైజ్ నుండి Galaxy Z Flip5 స్టైలిష్, విలక్షణమైన ఫోల్డబుల్ అనుభవం అందిస్తుంది. స్మార్ట్ ఫోన్ బయటి స్క్రీన్ ఇప్పుడు 3.78 రెట్లు పెద్దది, ఇంతకు ముందు కంటే మరింత ఎక్కువ వాడకాన్ని అందిస్తుంది. Galaxy Z Flip5 కూడా Samsung Galaxy స్మార్ట్ ఫోన్ పైన అత్యంత విలక్షణమైన కెమేరా అనుభవం అందిస్తోంది. ఫ్లెక్స్ కామ్‌తో సృజనాత్మకమైన యాంగిల్స్ నుండి యూజర్స్ అద్భుతమైన హ్యాండ్స్ – ఫ్రీ ఫోటోస్ కాప్చర్ చేయవచ్చు. స్నేహితుని ఫోటో తీసేటప్పుడు, డ్యూయల్ ప్రివ్యూ యూజర్ కు తమను ఫ్లెక్స్ విండో నుండి చూసే అవకాశం ఇస్తుంది. అందువలన ఖచ్చితమైన షాట్ కోసం వాస్తవిక సమయంలో వారు సర్దుబాట్లు చేయగలరు.

శక్తివంతమైన కెమేరా అనుభవానికి ఏఐ పరిష్కారం మెరుగుదలలను Galaxy Z Flip5 చేర్చి, ప్రతి ఫోటోక సహజత్వాన్ని తెస్తుంది. మెరుగుపరచబడిన నైటోగ్రఫి ఫీచర్ పరిసర లైటింగ్ పరిస్థితులలో ఫోటోస్ మరియు వీడియోస్ ను అనుకూలం చేస్తుంది. ఏఐ-పవర్డ్  ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ (ISP) విధానం తక్కువ కాంతి గల ఇమేజెస్ ను సాధారణంగా పాడుచేసే ఏవైనా దృశ్యపరమైన శబ్దాలను సరిచేస్తుంది, వివరాలు మరియు కలర్ టోన్ ను పెంచుతుంది. దూరం నుండి కూడా ఫోటోస్ డిజిటల్ 10x జూమ్‌తో స్పష్టంగా కనిపిస్తాయి.

Galaxy Z Flip5 కి ఐపీx8 మద్దతు గలదు, ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్స్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఫ్లెక్స్ విండో మరియు బ్యాక కవర్ కు వర్తింపచేయబడ్డాయి. కొత్తగా సమీకృతం చేయబడిన హింజ్ మాడ్యూల్ తో Galaxy Z Flip5 లభిస్తోంది. బయటి ప్రభావాలను చెల్లాచెదురు చేయడానికి డ్యూయల్ రైల్ వ్యవస్థను ఇది కలిగి ఉంది.

మెమోరీ వేరియెంట్స్ మరియు ధర
Galaxy Z Flip5 8 + 256 GB మరియు 8+512 8+512లలో వరుసగా రూ. 99,999 మరియు రూ. 109, 999కి ఎంపిక చేయబడిన రీటైల్ అవుట్‌లెట్స్‌లో లభిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు