వైఫైతో ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు అశ్లీల చిత్రాల వీక్షణ...

సోమవారం, 24 జులై 2017 (12:38 IST)
భారతీయులు అశ్లీల చిత్రాల వీక్షణకు బానిసలైపోతున్నట్టు తెలుస్తోంది. ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు అశ్లీలచిత్రాలు చూస్తున్నారు. విచిత్రం ఏమిటంటే హోటళ్లు, విమానాశ్రయాలు, గ్రంథాలయాలు, పని ప్రదేశాలతోపాటు వీధుల్లోనూ భారతీయులు వీటిని చూస్తున్నారు. ఈ విషయం సైమన్‌ టెక్ సంస్థ నిర్వహించిన నార్టన్ సర్వేలో వెల్లడైంది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
డిజిటల్ ఇండియా పుణ్యమాని అనేక ప్రాంతాల్లో ఉచిత వైఫై అందుబాటులోకి వచ్చింది. రైల్వే స్టేషన్లు, బడా మాల్స్, ఎయిర్‌పోర్టులు, బస్టాండులు ఇలా అనేక ప్రాంతాల్లో వైఫై సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఉచిత వైఫైతో పోర్న్ చిత్రాలను అధికంగా చూస్తున్నట్టు తేలింది. 
 
wifi-generic-ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో 1000 మంది భారతీయులు పాల్గొని తమ అభిప్రాయాలను సేకరించారు. ఇందులో ప్రతి ముగ్గురిలో ఒకరు తాము ఉచిత వైఫైని అశ్లీల దృశ్యాలు చూడటానికే ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
 
అయితే, కేవలం భారతీయులు మాత్రమే చూస్తున్నారు అనుకుంటే పొరపాటే.. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఆరుగురిలో ఒకరు ఉచిత వైఫై ద్వారా అశ్లీల చిత్రాలు చూస్తున్నట్లు సర్వేలో తేలింది. జపాన్, మెక్సికో, నెదర్లాండ్స్, బ్రెజిల్, అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్‌లకు చెందిన ప్రజలు ఈ సర్వేలో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి