ఇప్పటికే దాదాపుగా యాప్ డిజైన్‌కు టాటా గ్రూప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో లేదంటే జనవరి నెలలో టాటా ఈ కామర్స్ బిజినెస్ ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఈ-కామర్స్ బిజినెస్‌కు మంచి డిమాండ్ పెరిగింది. దీనితో టాటా గ్రూప్ ఈ కామర్స్ వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూప్ కంపెనీలు కార్లు, ఎయిర్ కండీషనర్లు, లగ్జరీ హోటల్స్, డిపార్టమెంటల్ స్టోర్స్, సూపర్‌మార్కెట్ చెయిన్ మొదలైనవన్నీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
వీటన్నింటిని ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంచితే వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందుతుందని టాటా గ్రూప్ భావిస్తోంది. దీనికోసం ఆల్ ఇన్ వన్ యాప్‌ను తీసుకొస్తోంది. కాగా, ఈ యాప్ రూపకల్పనలో టాటా డిజిటల్ విభాగం సీఈఓ ప్రతీక్ పాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.