ఆదాయం పరంగా టీసీఎస్ దేశంలోని ఐటీ కంపెనీల్లో అతి పెద్దదిగా ఉంది. అయితే కంపెనీ ప్రస్తుతం 5G సేవలు, నెట్‌వర్క్, ఇతర సంబంధింత వ్యాపారాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తోంది. టెలికాం కంపెనీలు ఈ కొత్త టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెట్టటంతో ఇందులో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు టాటాలు సిద్ధమయ్యారు.
టీసీఎస్ 5G సర్వీస్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఇంజనీరింగ్ సేవలను అందించడానికి తన కమ్యూనికేషన్స్, మీడియా విభాగంలో నెట్‌వర్క్ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ యూనిట్‌ను సృష్టించింది. నెట్‌వర్క్ సొల్యూషన్స్ అండ్ సర్వీసెస్ విభాగానికి విమల్ కుమార్ నేతృత్వం వహిస్తారని కంపెనీ వెల్లడించింది.