టూర్ ముగించుకుని భారత్‌లో అడుగుపెట్టినా అతడి ప్యాకేజీ డీ యాక్టివేట్ కాలేదు. ఫలితంగా జూన్ 8 నుంచి జూలై 7 వరకు నెల రోజులకు గాను ఏకంగా రూ.1.86 లక్షల బిల్లు వచ్చింది. దీంతో కంగుతిన్న నితిన్ వెంటనే వినియోగదారుల సేవా కేంద్రానికి ఫిర్యాదు చేయగా, సాంకేతిక కారణాల వల్లే బిల్లు తప్పుగా జనరేట్ అయ్యిందన్నారు. మరో బిల్లు పంపిస్తామని చెప్పడంతో సేథీ ఊపిరి పీల్చుకున్నాడు. ఎయిర్‌టెల్ తనకు పంపిన బిల్లును నితిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.