ఈ ఫోనులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండటం విశేషం. గత నెలలో టెక్నో కామోన్ 16 ప్రీమియర్ గ్లోబల్ లాంచ్ జరిగినప్పుడు కామోన్ 16ను కూడా ప్రకటించారు. ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. దీని సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ గా ఉంది. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లేను కూడా అందించారు.
ఇందులో కేవలం 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.10,999గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత హైఓఎస్ 7.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.