జియో ఎఫెక్ట్.. ప్రపంచంలోకెల్లా భారత్‌లో చౌక ధరకే డేటా

గురువారం, 7 మార్చి 2019 (11:14 IST)
ఉచిత డేటా పేరుతో దేశంలో సంచలనం సృష్టించిన జియో పుణ్యంతో.. ప్రపంచంలోకెల్లా ఒక్క మన భారతదేశంలోనే మొబైల్ డేటా చాలా చౌకగా దొరుకుతోంది. మొబైల్ డేటాకు ప్రపంచంలో ప్రజలు ఎంత చెల్లిస్తున్నారనే దానిపై జరిగిన అధ్యయనంలో భారత్‌లోనే డేటా ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. ఒక బ్రిటన్‌లో యూరప్‌లోనే అత్యంత ఖరీదైన డేటా ధరలు వసూలు చేస్తున్నట్లు స్పష్టమైంది.
 
ప్రపంచ వ్యాప్తంగా 230 దేశాల్లో మొబైల్ డేటా ధరలపై జరిపిన అధ్యయనంలో యూకేకి 136వ స్థానం లభించింది. 1జీబీ డేటాకు ప్రపంచ సగటు ధర 8.53 డాలర్లుగా ఉంది. ఇక జింబాబ్వేలో 1జీబీ మొబైల్ డేటా కావాలంటే ప్రపంచంలోనే అత్యధికంగా 75.20 డాలర్లు వదుల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక  డౌటా చౌకైన టాప్-5 దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. కిర్గిజిస్థాన్, కజకిస్థాన్, ఉక్రెయిన్, రువాండాలు టాప్-5లో స్థానం సంపాదించుకున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు