డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ వంటి మూడు అంశాల్లో యూజర్‌కు అన్ని విధాలుగా నచ్చేవిధంగా కాన్ఫిగరేషన్ ఉండేలా ఫోన్‌ను తేవాలని ఎయిర్‌టెల్ భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే లావా, కార్బన్ వంటి సంస్థలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
అంతా అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ చివరి వరకు లేదా అక్టోబర్ మొదటి వారంలో ఎయిర్‌టెల్ తన బడ్జెట్ 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయవచ్చని తెలుస్తున్నది. అయితే, ఈ వార్తలపై ఎయిర్‌టెల్ ఇప్పటివరకు ఎలాంటి అధికారక సమాచారం వెల్లడించలేదు.
కాగా, ఇటీవల రిలయన్స్ జియో ఉచితంగా 4జీ ఫీచర్ ఫోన్‌ను అందజేయనున్నట్టు ప్రకటించింది. అలాగే, ఐడియా తన కంపెనీ ద్వారా చాలా తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తామని వెల్లడించింది. ఇదే కోవలో ప్రస్తుతం ఎయిర్‌టెల్ కూడా చౌక ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందించనున్నట్టు ప్రకటించడం గమనార్హం.