చైనీస్ యాప్స్ నిషేధం: 12 మిలియన్లకు పైగా కొత్త డౌన్‌లోడ్‌లను నమోదుతో ట్రెల్ రికార్డు

సోమవారం, 6 జులై 2020 (21:49 IST)
ప్రముఖ చైనా యాప్ టిక్‌టాక్‌తో పాటు 58 యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించడంతో, భారతీయ విషయాంశ సృష్టికర్తలు స్వదేశంలోనే తయారు చేయబడిన, యాప్ ట్రెల్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా దాని వేదికపై ఇలాంటి చిన్న-వీడియో తయారీ అంశాలను అందిస్తుంది.
 
ఆత్మనిర్భర్ భారత్‌ను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం తరువాత, కేవలం 5 రోజుల్లోనే 12 మిలియన్ డౌన్‌లోడ్లను చవిచూసిన ఈ లైఫ్ స్టైల్ కమ్యూనిటీ-కామర్స్ వేదిక అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. ఉచిత జీవనశైలి యాప్‌లలో నెం 1 స్థానంలో ఉన్న ఈ వేదిక, 220 వేల కొత్త కంటెంట్ సృష్టికర్తలతో ఒకే రోజులో 500 వేల అప్‌లోడ్‌లను అందుకుంది.
 
భారత్ కోసం వీడియో పింటెరెస్ట్‌గా ప్రసిద్ది చెందిన ట్రెల్, వినియోగదారులు ఆరోగ్యం మరియు ఫిట్నెస్, అందం మరియు చర్మ సంరక్షణ, ప్రయాణం, చలన చిత్ర సమీక్షలు, వంట, ఇంటి అలంకరణ మరియు అనేక రకాలైన వారి అనుభవాలు, సిఫార్సులు మరియు సమీక్షలను పంచుకోవడానికి తగిన వేదిక.
 
లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ప్లాట్‌ఫాం వినియోగదారులను వారి స్థానిక భాషలలో 3-5 నిమిషాల వీడియోలతో పాటు ‘షాప్’ ఫీచర్‌తో పాటు వ్లాగ్స్‌లో ఫీచర్ చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. అదనంగా, ప్లాట్‌ఫాం వినియోగదారులను దాని ఇంటర్‌ఫేస్ ద్వారా రివార్డులు, గూడీస్ మరియు సెలవులను సంపాదించడానికి వీలు కల్పిస్తుంది.
 
పెరుగుతున్నఅభివృద్ధి సంఖ్యపై వ్యాఖ్యానిస్తూ, ట్రెల్ సహ వ్యవస్థాపకుడు పుల్కిత్ అగర్వాల్ మాట్లాడుతూ, “ఇంత ధైర్యంగా అడుగులు వేసినందుకు, భారతీయ వేదికల కోసం అవకాశాల రంగాన్ని తెరిచినందుకు, వోకల్ ఫర్ లోకల్ గురించి తన దృష్టిని ముందుకు తీసుకెళ్ళినందుకు, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. భారతీయ ఇంటర్నెట్ స్టార్టప్‌లు వేగంగా వృద్ధి చెందుతాయి. వినియోగదారులకు దీర్ఘకాలిక అనుభవాన్ని నిర్మించగలవు.
 
వీటిని గతంలో ఇదివరకే స్థిరపడిన సంస్థలు మరుగున ఉంచారు. వారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అనుభవజ్ఞులైన నిర్వహణ బృందం మరియు ఇండియన్ మార్కెట్లో చాలా భారీ మూలధనంతో వస్తారు. ఇది భారతీయ స్టార్టప్‌లను ఎదుర్కోవడం చాలా కష్టతరం చేసింది. కొన్ని కంపెనీలు, ఇండియన్ డిజిటల్ ప్రొడక్ట్స్ పిక్సెల్-బై-పిక్సెల్‌ను వారి ఉనికిని సవాలు చేయడానికి కాపీ చేయడాన్ని మేము చూశాము. దేశం యొక్క అతిపెద్ద జీవనశైలి సామాజిక యాప్ వలె, మా వినియోగదారుల గోప్యత మరియు డేటా రక్షించబడిందని మరియు మన దేశం యొక్క పరిధిలోనే ఉండేలా మేము కొనసాగిస్తాము.”
 
2017లో ప్రారంభమైనప్పటి నుండి, ట్రెల్ దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక వినియోగదారుల జీవనశైలి విషయాంశాల ఆవశ్యకతలను తీర్చడానికి కట్టుబడి ఉంది. దాని వినియోగదారులలో 60% పైగా టియర్-2 మరియు టియర్-3 నగరాలకు చెందినవారు. ట్రెల్ తన వేదికను ఇటీవలేల మూడు కొత్త భాషలలో ప్రారంభించింది. మరాఠీ, కన్నడ మరియు బెంగాలీ, ఇప్పటివరకు మొత్తం 8 భాషలలో (అదనంగా, హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మలయాళం) క్రియాశీలకంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు