టిక్ టాక్, వీ చాట్‌లపై బ్యాన్.. సంతకం చేసిన ట్రంప్.. 45రోజుల్లోగా అమలు

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (10:43 IST)
చైనాపై ప్రపంచ దేశాలు గుర్రుగా వున్నాయి. ఇందులో భాగంగా చైనా యాప్స్‌పై బ్యాన్ కొనసాగుతోంది. అమెరికాను ఆర్ధికంగా దెబ్బతీయడానికి చైనా చూస్తోందని.. టిక్ టాక్, వీ చాట్ వంటి యాప్స్ ద్వారా అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని ఆయా కంపెనీలు చైనా కమ్యునిస్ట్ ప్రభుత్వానికి అందజేస్తున్నాయని ట్రంప్ గతంలోనే పలు విమర్శలు గుప్పించారు. ఇక భారత్‌లో కూడా చైనాకు సంబంధించిన 59 యాప్స్ బ్యాన్ అయిన సంగతి తెలిసిందే.  
 
తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్‌పై బ్యాన్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ బ్యాన్ 45 రోజుల్లోగా అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. అంతకముందు ట్రంప్ టిక్‌టాక్‌ను చైనాకు చెందిన బైట్‌డాన్స్ కంపెనీ.. అమెరికా సంస్థకు విక్రయించాలని.. లేదంటే బ్యాన్ తప్పదని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలోనే సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలని చూస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. సెప్టెంబర్ 15కు ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో 45 రోజుల్లోగా లావాదేవీలన్నింటిపైనా నిషేధం విధించనున్నట్లు ట్రంప్ పేర్కొంటూ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు