ఫేక్‌న్యూస్ కట్టడికి ట్విట్టర్ రంగం సిద్ధం.. లేబుల్స్ రెడీ

శుక్రవారం, 7 ఆగస్టు 2020 (19:28 IST)
ఫేక్‌న్యూస్ కట్టడికి ట్విట్టర్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఫ్యాక్ట్ చెక్ విధానాన్ని ప్రవేశపెట్టిన ట్విట్టర్.. ప్రభుత్వ అధికారులు, కీలక సంస్థలు, మీడియా ప్రతినిధుల ట్విటర్‌ ఖాతాలకు లేబుల్స్‌ ఇస్తోంది. భారత్‌లో ఈ విధానం అమలు చేయకపోవచ్చు.
 
అయితే ఈ లేబులింగ్ విధానం వల్ల ప్రజలు వారు చెప్పేదానిని అంచనావేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొంది. అధికారులు, ఉద్యోగులు సమాచారం పంచుకోవడాన్ని కొనసాగించవచ్చని వెల్లడించింది. ముఖ్యంగా అమెరికా ఎన్నికలు సమీపిస్తుండటంతో తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్డుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది.
 
ట్విటర్‌ బ్లాగ్‌ ప్రకారం.. కీలకమైన ప్రభుత్వ అధికారులు, మంత్రులు, వ్యవస్థీకృత సంస్థలు, రాయబారులు, దౌత్యవేత్తలు, ప్రతినిధులు, దీంతోపాటు ప్రభుత్వాల కింద పనిచేసే మీడియా సంస్థల చీఫ్‌ఎడిటర్లు, వారి సీనియర్‌ సిబ్బందికి లేబుల్స్‌ కేటాయిస్తారు. 
 
దేశాధ్యక్షుల వ్యక్తిగత ఖాతాలపై ఎటువంటి లేబులింగ్ ఉండదని పేర్కొంది. ఐరాస భధ్రతా మండలిలోని శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాల్లోనే ఈ విధానం అమలు చేస్తామని ట్విటర్‌ పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు