ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి కూడా సుశాంత్ కేసులో చివరి సాక్షి, నిందితుడు అని రాజీవ్ రంజన్ పేర్కొన్నారు. మేనేజర్ దిషా సాలియన్ తర్వాత సుశాంత్ మరణం సంభవించింది. ఈ కేసులో ఏకైక సాక్షిగా రియా చక్రవర్తి మిగిలిపోయింది. ఈ కేసులో పాల్గొన్న నిందితులు ఎప్పుడైనా రియా చక్రవర్తిని చంపవచ్చు. అందువల్ల, ఆమె స్టేట్మెంట్ కోర్టులో నమోదు చేసుకోవడం చాలా ముఖ్యమని రాజీవ్ చెప్పారు.