తప్పుడు సమాచారాన్ని కట్టడి చేయడంలో భాగంగా ట్విట్టర్ బర్డ్‌వాచ్ అనే కొత్త టూల్‌ను అభివృద్ధి చేసింది. డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ వినియోగదారుల్లో కొంతమందికి పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని రోల్‌ఔట్ చేస్తున్నట్టు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ అధికారికంగా ప్రకటించింది.
ట్వీట్ చేసిన సమాచారం తప్పా, ఒప్పో తెలుసుకోవడాని బర్డ్ వాచ్ సాయపడుతుంది. ట్వీట్‌లో చేసిన ఇన్ఫర్మేషన్ తప్పు అనిభావించిన ట్విట్టర్ యూజర్ దానిపై బర్డ్‌వాచ్‌తో టిక్ చేయొచ్చు. సదరు ట్వీట్ ఎందుకు తప్పో తెలుసుకునేందుకు చిన్నపాటి సర్వే జరుగుతుంది. దానిపై ట్వీపుల్స్ రిపోర్టు చేయొచ్చు. ఒకవేళ ఆ ట్వీట్ సరైనది అయితే ఒకే చెప్పొచ్చు. లేదంటే తప్పని వెల్లడించొచ్చు.