ఇటీవలి కాలంలో సోషల్ మీడియా హవా పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సంస్థల్లో ట్విట్టర్ ఒకటి. భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిన ట్విట్టర్.. తద్విరుద్ధంగా నడుచుకుంటోంది. ఈ విషయంపై కేంద్రం, ట్విట్టర్ యాజమాన్యానికి మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది.
ఇదిలావుంటే, తాజాగా ఆఫ్రికాలోని నైజీరియా సర్కారు మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫార్మ్ ట్విట్టర్‌పై సస్పెన్షన్ వేటువిధించింది. ట్విట్టర్‌ను సస్పెండ్ చేసినట్లు నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది. నైజీరియా దేశ అధ్యక్షుడు ట్వీట్‌ను తొలగించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రభుత్వమే ప్రకటించింది.
నిజానికి ట్విట్టర్ బ్యాన్‌పై ఆ దేశంలో వ్యతిరేకతే ఎక్కువగా కనిపిస్తుంది. నైజీరియా ట్విట్టర్ బ్యాన్‌పై ప్రకటన చేసినప్పటికీ శుక్రవారం అర్ధరాత్రి వరకు వినియోగదారులు తమ ఖాతాను ఉపయోగించుకున్నారు. ఇకపై కూడా వీపీఎన్ ద్వారా ట్విట్టర్‌ను వినియోగిస్తామని.. ప్రభుత్వం నిర్ణయంతో తమకు పనిలేదని నెటిజన్లు పేర్కొంటున్నారు.