జియో దెబ్బతో ప్రముఖ టెలికామ్ మొబైల్ ఆపరేటర్ వొడాఫోన్ కొన్ని ఆసక్తికరమైన పథకాలను అందుబాటులోకి తేనుంది. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మొదలుపెట్టిన ఉచిత ఆఫర్ల ధాటికి తట్టుకునే దిశగా వొడాఫోన్ కూడా తన ఫ్లాన్‌లో కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే వొడాఫోన్ రెడ్‌లో మార్పులు చేసిన ఈ కంపెనీ శుక్రవారం మరికొన్ని కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది. ప్రీ పెయిడ్ వినియోగదారులకు 'సూపర్ అవర్' పథకాన్ని ప్రకటించింది.