సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ రిలీజ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వాట్సప్ వాడేవారి అవసరాలకు తగ్గట్టుగా ఈ ఫీచర్స్‌ని రూపొందిస్తూ ఉంటుంది వాట్సప్. ఈ ఫీచర్స్ యూజర్లను బాగా ఆకట్టుకుంటాయి కూడా. అలాంటి మరిన్ని ఫీచర్స్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందించేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. మల్టీ డివైజ్ సపోర్ట్, మిస్డ్ గ్రూప్ కాల్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
వ్యూవ్ ఒన్స్: వాట్సప్‌లో వచ్చే ఫోటోలు, వీడియోలతో మీ స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ నిండిపోతుందా? త్వరలో ఈ సమస్యకు పరిష్కారం రాబోతోంది. వ్యూ వన్స్ ఫీచర్ వస్తోంది. ఈ ఫీచర్‌తో మీరు ఫోటోలు, వీడియోలు డౌన్‌లోడ్ చేయకుండా ఒకసారి చూస్తే సరిపోతుంది. డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.