అంతేకాకుండా, గ్రూప్ ప్రైవసీ సెట్టింగ్స్‌లో కూడా మరో ఫీచర్ జోడిస్తున్నారు. గ్రూపులో చేరాల్సిందిగా అభ్యర్థన పంపేవారిని బ్లాక్ లిస్ట్ సాయంతో బ్లాక్ చేయొచ్చు. ఈ గ్రూప్ బ్లాక్ లిస్ట్ ఫీచర్‌ను మొదట ఐఫోన్ యూజర్లకు విడుదల చేస్తారు.
ముఖ్యంగా, ఒకేసారి అనేక డివైస్‌లలో లాగిన్ అయ్యేందుకు వీలు కల్పించే ఫీచర్‌ను వాట్సాప్ త్వరలోనే ఆవిష్కరించనుంది. ఇప్పటివరకు ఒక డివైస్‌లో వాట్సాప్ లాగిన్ అయివున్నప్పుడు మరో డివైస్‌లో లాగిన్ అయితే, ముందు లాగిన్ అయిన డివైస్‌లో వాట్సాప్ లాగ్ అవుట్ అవుతుంది.