ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ప్రీమియం ప్లాన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. కస్టమర్లకు మరింత పర్సనలైజేషన్ సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను రూపొందిస్తుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లు యాప్‌ను తమకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు.
ముఖ్యంగా యాప్ ఐకాన్‌ను మార్చుకునే అవకాశం కల్పిస్తుంది. 14 రకాల ఐకాన్ స్టైల్స్‌ను వాట్సాఫ్ అభివృద్ధి చేస్తోంది. ఫోన్‌లో ఉండే రింగ్‌టోన్లు, అలర్ట్ టోన్స్ కాకుండా వాట్సాప్ ప్లస్ ప్రత్యేకంగా రింగ్‌టోన్‌లను కస్టమర్లకు అందించనున్నట్లు సమాచారం.