వాట్సాప్ నుంచి మరో క్రేజీ ఫీచర్ వచ్చేసింది.. తెలుసా?

మంగళవారం, 20 డిశెంబరు 2022 (11:43 IST)
సోషల్ మీడియా అగ్రగామి అయిన వాట్సాప్ మరో క్రేజీ ఫీచర్‌తో ముందుకు వచ్చింది. యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది వాట్సాప్. మనం పంపాలనుకునే వ్యక్తికి లేదా గ్రూప్‌కు కాకుండా మరొకరికి మెసేజ్ పంపి.. పొరపాటున డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌కు బదులుగా డిలీట్ ఫర్ మీ పై క్లిక్ చేయడం జరుగుతూ వుంటుంది. దీంతో అవతలి వారికి ఈ మెసేజ్ కనిపిస్తూనే ఉంటుంది.  
 
దీనివల్ల కొన్నిసార్లు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ అసౌకర్యాన్ని గుర్తించింది వాట్సాప్. ఈ సమస్యను పరిష్కరించడానికి, యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. యాక్సిడెంటల్ డిలీట్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజులు వాడుతున్న వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి