సాధారణంగా గూగుల్ మీట్, జూమ్ యాప్స్‌లో గ్రూపు కాల్స్ కోసం యూజర్లు తమ లింక్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేసిన లింకును ఇతరులకు పంపుకునే వీలుంది. అదే తరహాలో వాట్సాప్‌లో కూడా ఈ సరికొత్త ఫీచర్ మెసేజింగ్ ప్లాట్ ఫాంపై రానుంది.
ఇప్పటికే ఈ ఫీచర్ కోసం వాట్సాప్ టెస్టింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వాట్సాప్ గ్రూపులో హోస్ట్ చేసే వ్యక్తి ఈ లింక్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అలా గ్రూపులోని అందరికి ఆ లింకును పంపవచ్చు. మీ మొబైల్ కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారే కాదు. మీ మొబైల్ కాంటాక్టు లిస్టులో లేనివారికి కూడా ఈ గ్రూపు జాయిన్ లింక్ పంపుకోవచ్చు.