మెటా-యాజమాన్యమైన మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్.. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. అందుకే చాలా తక్కువ వ్యవధిలో కొత్త ఫీటర్లతో అప్‌గ్రేడ్ చేస్తుంది.
తాజాగా ఈ యాప్ త్వరలో పాత ఆండ్రాయిడ్ వెర్షన్‌లలో పనిచేయడం ఆపివేస్తుంది. ఇది ఈ యాప్ వినియోగదారుల సంఖ్యను భారీగా తగ్గించుంకుందని టాక్.
ఆండ్రాయిడ్ వెర్షన్‌లు అధికారిక మద్దతును కోల్పోయే సమయాన్ని కూడా గూగుల్ షెడ్యూల్ చేసింది. ఇది భద్రతా ప్రమాదాలకు ఎక్కువ అవకాశం కలిగిస్తుంది. మెసేజింగ్ యాప్ ఆ మార్పులకు కట్టుబడి ఉంటుంది.
ప్రస్తుతం, వాట్సాప్ వెర్షన్ 4.1 లేదా కొత్త వెర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పని చేస్తోంది. కానీ అక్టోబర్ 24 నుండి, వాట్సాప్ ఆండ్రాయిడ్ 5.0 లేదా అంతకంటే కొత్త ఫోన్‌లలో మాత్రమే పని చేస్తుంది.
వాట్సాప్ పని చేయడం ఆపివేసే ఫోన్‌ల జాబితాను పరిశీలిస్తే..