ఫైబర్, టవర్ ఆస్తులను విడదీసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ)తో దీర్ఘకాల సామర్థ్య లీజింగ్ ఒప్పందాల కారణంగా ఏటా రూ.9,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని ప్రత్యర్థి కంపెనీలైన వోడాఫోన్ ఐడియా(వీఐఎల్), భారతి ఎయిర్‌టెల్ పెట్టుబడుల రూపంలో సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. కానీ, రిలయన్స్ జియో మాత్రం కస్టమర్లపై భారం మోపాలని భావిస్తోంది.
వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ పెట్టుబడులు పెంచుకొనే ప్రణాళికలపై మదుపరుల విశ్వాసం పెరుగుతున్నట్టు సంస్థ తెలిపింది. ఆయా సంస్థల పోరాట సామర్థ్యం సూచనప్రాయంగా తెలుస్తుండటంతో జియో తన ధరలపై పునరాలోచించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాబోయే రెండు మూడేళ్ల పాటు తన బ్యాలెన్స్ షీట్‌లో పెట్టుబడులను పెంచుకుంటూ పోగలదా? అనేది కీలకం కానుంది.