మిక్స్ ఫోల్డ్‌లో రెండు స్క్రీన్లు ఉన్నాయి. అందులో ఒకటి సింగిల్ ఔటర్ స్క్రీన్ కాగా మరొకటి ఫోల్డింగ్ ఇన్నర్ డిస్‌ప్లే. గెలాక్సీ ఫోల్డ్ 2 మాదిరిగా ఔటర్ డిస్‌ప్లేలో లార్జ్ ఫుల్ స్క్రిన్ ఉంటుంది. ఔటర్ స్క్రీన్ 6.52 అంగుళాల అమోలెడ్ ప్యానెల్‌ను కలిగి ఉండగా ఇన్నర్ ఫోల్డింగ్ స్క్రీన్ సైజు 8.01 అంగుళాలతో ఉంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, హువావే మేట్ ఎక్స్2 మడతబెట్టే ఫోన్లకు మార్కెట్లో మిక్స్ ఫోల్డ్ గట్టిపోటీ నివ్వనుంది.
మిక్స్ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌లో బేసిక్ వేరియంట్ ధర సుమారు 1,12,100గా ఉండగా టాప్ మోడల్ ధర సుమారు రూ.1,45,700 నిర్ణయించారు. చైనాలో ఏప్రిల్ 16 నుంచి ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఐతే ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాల్లో మడతబెట్టే ఫోన్లను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో కంపెనీ ప్రకటించలేదు.