ప్రపంచ దేశాలను వణికించిన సైబర్ అటాక్‌తో జొమాటో సంస్థకు కూడా హ్యాకర్లు చుక్కలు చూపించారు. 120మంది మిలియన్ యూజర్లలో దాదాపు 17 మిలియన్ల మంది యూజర్ల రికార్డులను డేటా బేస్ నుంచి హ్యాకర్లు దొంగలించారని జొమాటో వెల్లడించింది. దేశ, విదేశాల్లోని రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన సమాచారాన్ని అందజేసే జొమాటో సంస్థకు చెందిన డేటా హ్యాకర్ల గురికావడంతో యూజర్లు వెంటనే పాస్ వర్డ్‌లను మార్చుకోవాలసి సూచించారు.
మల్టిపుల్ సైట్స్‌లో ఒకే పాస్ వర్డ్ వాడరాదని జొమాటో సూచించారు. గతంలో 2015లో హ్యాంకింగ్‌కు గురైన ఈ సంస్థకు చెందిన తాజా డేటాను ఈసారి హ్యాకర్లు యూజర్ పేర్లు, పాస్ వర్డ్‌తో పాటు బేరానికి పెట్టారని.. దాడికి గురైన బాధితుల పాస్ వర్డులను మేం రీసెట్ చేయడమే గాక, యాప్, వెబ్ సైట్ ల నుంచి వేరుచేశామని జొమాటో ప్రకటించింది. పేమెంట్ డేటా భద్రంగా ఉందని.. రెండు, మూడు రోజుల్లో తమ సెక్యూరిటీ సిస్టమ్‌ను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.