చౌకధర ఐఫోన్‌లు: సెకెండ్ హ్యాండ్ మార్కెట్లో ట్రై చేయండి!

ఏదైనా ఖరీదు ఫోన్ తక్కువ ధరలో కావాలనుకుంటే.. సెకెండ్ హ్యాండ్ మార్కెట్లో హ్యీపీగా ట్రై చేసుకోవచ్చు. ఇటీవల వచ్చిన ఐఫోన్‌తో సహా ఆ మార్కెట్లో అత్యంత చౌక ధరల్లో లభిస్తాయి. అతి కొద్ది నెలల క్రితం కొనుగోలు చేసిన కొత్త మోడళ్లే అందుబాటులో అత్యంత చౌక ధరలో ఉంటాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

మార్కెట్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. ఆరు నెలల క్రితం కొన్న హై ఎండ్ మోడళ్ ఫోన్లు సెకెండ్ హ్యాండ్ మార్కెట్లో 50 శాతం తక్కువ ధర వద్ద లభిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి మూడు నెలల క్రితం కొనుగోలు ఒక ఒరిజినల్ ఐఫోన్ సెకెండ్ హ్యాండ్ మార్కెట్లో 20 నుంచి 30 శాతం వరకు తగ్గింపు ధర వద్ద అందుబాటులో ఉంటోందని తెలుస్తోంది.

ప్రస్తుతం సాధారణ మార్కెట్లో ఐఫోన్ ధర రూ. 30వేలకు పై మాటే. అలాంటిది... కేవలం మూడు నెలల వ్యవధిలో 30 శాతం వరకు తక్కువ ధరలో సెకెండ్ హ్యాండ్ మార్కెట్లో లభిస్తుండటం గమనార్హం. దీని వల్ల వినియోగదారులు భారీగా పొదుపు చేసే అవకాశమే కాకుండా.. అనేక ఫీచర్స్ ఉన్న అధిక ధరల ఫోన్‌ల (హై ఎండ్ మొబైల్)లో వివిధ మోడళ్లను ఉపయోగించాలన్న కోరికా తీరుతుందని.. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం.

అలాగే ఈ మొబైళ్లకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. తక్కువ ధరల ఫోన్‌లు లేదా పాత మొబైళ్లను ఇచ్చి ఈ హై ఎండ్ మొబైల్స్‌ను తీసుకెళ్లొచ్చు.

ఒక బ్రాండ్ న్యూ ఐఫోన్ 3జీ 8జీబీ సాధారణ మార్కెట్లో రూ. 31,000.. అలాగే ఐఫోన్ 3జీ, 16జీబీ 36,000. మార్కెట్లో ఉపయోగిస్తున్న ఐఫోన్‌లలో డైమండ్ల‌తో మిళితమైన ఉన్న ఫోన్‌లైతే.. రూ. 2 నుంచి 3 కోట్ల వరకు ఉంటుంది. ఒక కొత్త నోకియా ఎన్97 రూ. 33,000, సోనీ ఎరిక్సన్ సీ095 రూ. 23,000, శామ్‌సంగ్ ఓమ్నియా సిరీసీ రూ. 29,000, హెచ్‌టీసీ టచ్ హెచ్‌డీ రూ. 40,000, ఎక్స్‌క్లూసివ్ నోకియా వెర్టు రూ. 4 లక్షలు.. ఇవన్నీ కూడా సాధారణ మార్కెట్లో ఉన్న మొబైల్ ధరల కన్నా సెకెండ్ హ్యాండ్ మార్కెట్లో 20 నుంచి 50 శాతం వరకు తక్కువ ధరలకే అందుబాటులోకి ఉన్నాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

ఒక విభాగపు విశ్లేషకుల వివరాల ప్రకారం.. ఇది పోటీ ప్రపంచం.. ఈ ప్రపంచంలో రోజుకో మొబైల్ మోడళ్ చొప్పున లెక్కలేనన్ని మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిల్లో వైవిధ్య మోడళ్లన్నింటినీ.. ప్రత్యేకించి కొత్త కొత్త హై ఎండ్ సెల్‌ఫోన్‌లను కొంత మంది వినియోగదారులు తరుచూ మారుస్తూ ఉండటం రివాజు. విద్యార్థులు, బడా సంస్థల యజమానులు, ప్రొఫెషనల్స్‌లు ఈ కోవలో ఉన్నారు.

వీరిలో చాలా వరకు మూడు లేదా ఆరు నెలల కన్నా మించి ఒకే మోడళ్‌ను తమ వద్ద ఉంచుకోవడం జరగదు. దీంతో పాత మొబైల్‌ను విక్రయించేస్తుంటారు. కనుక.. ఇవన్నీ కూడా ఇప్పుడు నగరాల్లో సెకెండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ మాదిరే మెబైల్ ఫోన్ రంగంలోను ఉంది. అక్కడు ఈ ఫోన్లు చేరుకుంటాయి.

ఒక నెలలో బెంగుళూరు మార్కెట్లో సుమారు లక్షకు పైగా హై ఎండ్ మొబైల్ ఫోన్లు అమ్ముడు పోతాయని తెలుస్తోంది. ఇందులో 90 శాతంత సెకెండ్ హ్యాండ్ మార్కెట్ల ద్వారా ఈ విక్రయాలుండటం విశేషం. సెకెండ్ హ్యాండ్ ఫోన్ అయిన ఒరిజినల్ ప్యాకేజింగ్‌తో కూడిన బాక్స్‌ను కలిగిన మొబైల్‌నే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఒరిజనల్ సాఫ్ట్‌వేర్, డేటా కార్డ్, మాన్యువల్, ఛార్జర్ బ్యాటరీ, తదితరమైనవి కూడా కొత్త ఫోన్‌‌కు వచ్చినట్లే వస్తాయి.

వెబ్దునియా పై చదవండి