గతంలో బీపీఓ కాల్ సెంటర్‌లో ఉద్యోగం సంపాదించాలంటే అమెరికన్, ఇటాలియన్, ఫ్రెంచ్ తదితర భాషల్లో శిక్షణ పొందాల్సి వచ్చేది. అలాగే నిన్న, మొన్నటి వరకు అదే ఉద్యోగంలో చేరాలంటే ఇంగ్లీషు భాష ఉచ్చరించడంలో స్పష్టత కలిగి ఉండాలి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే బీపీఓ రంగం ప్రాంతీయ భాషల్లో కూడా ప్రవేశించింది.
సంపూర్ణ పద ఉచ్ఛారణ లేకపోవడంతో అంతర్జాతీయ కాల్ సెంటర్‌లో తిరస్కారం ఎదురైన వారందరికీ దేశీయ బీపీఓ రంగం ఉద్యోగాలిచ్చేందుకు స్వాగతం పలుకుతోంది. దేశంలోని సంబంధిత ప్రాంతాల మార్కెట్‌లను కైవసం చేసుకునేందుకు మొత్తం బీపీఓ రంగం ప్రణాళిక చేస్తోంది.
ఆర్ధిక వ్యవస్థ ఆశాజనకంగా పుంజకుంటుండటంతో ప్రాంతీయ భాషల్లో వినియోగదారులకు మేలైన సేవలను అందించడం ద్వారా సుమారు 1.6 బిలియన్ డాలర్ల దేశీయ బీపీఓ మార్కెట్‌ను కైవసం చేసుకునేందుకు పలు బీపీఓ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.
ప్రాంతీయ భాషా బీపీఓ కేంద్రాలు...
అంతర్జాతీయ కాల్ సెంటర్‌లో తిరస్కారం ఎదురైన వారందరికీ దేశీయ బీపీఓ రంగం ఉద్యోగాలిచ్చేందుకు స్వాగతం పలుకుతోంది. చిన్న చిన్న పట్టణాలైన సూరత్, బీదర్, పాండిచ్చేరి, రాంచీ, రాయ్‌పూర్, పాట్నా తదితర ప్రాంతాలకు ఈ బీపీఓ కేంద్రాలు విస్తృతం
కానున్నాయి.
చిన్న చిన్న పట్టణాలైన సూరత్, బీదర్, పాండిచ్చేరి, రాంచీ, రాయ్‌పూర్, పాట్నా తదితర ప్రాంతాలకు బీపీఓ కేంద్రాలు విస్తృతం కానున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, ముంబై వంటి ప్రముఖ నగరాల్లో సంప్రదాయ ప్రాంతీయ భాషల్లో వినియోగదారులకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో దేశీయ బీపీఓ రంగ కంపెనీ ఏగిస్ ఓ అడుగు ముందుకు వేసింది.
'శిక్ష' అనే ఓ విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారులకు అందించే సేవల్లో భాగంగా గుజరాతి, మరాఠీ, భోజ్‌పురీ, పంజాబీ, తెలుగు, తమిళం వంటి భాషలను ఎంత చక్కగా మాట్లాడవచ్చో ఉద్యోగులకు శిక్షణనిస్తోంది. దీంతో పాటు పదాల ఉచ్ఛారణలో స్పష్టతను... అలాగే భారత్‌లో వివిధ భాషల్లో ఉన్న భిన్నత్వాన్ని కూడా వివరిస్తారు.
సుమారు 16వేల మందికి ఆయా సంబంధిత ప్రాంతీయ భాషల్లో తర్ఫీదునిస్తోంది ఏగిస్ కంపెనీ. ఆంథ్రోపాలజిస్టులు, భాషా నిపుణులను శిక్షకులుగా ఎంచుకుంది. అంథ్రోపాలజీ ద్వారా సంబంధిత రాష్ట్రంలో జరిగే పండుగలు... అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవచ్చని... భాషా నిపుణుల ద్వారా ఆ రాష్ట్రంలో వాడుకలో ఉన్న భాషపై పట్టు వచ్చేలా తమ ఉద్యోగులకు శిక్షణనిప్పిస్తామని ఏగిస్ బీపీఓ గ్లోబల్ సీఈఓ మరియు ఎండీ అపరప్ సేన్‌గుప్తా తెలిపారు.
భారత్‌లో సుమారు 22 గుర్తింపబడిన భాషలు అలాగే వందలాది మాండలికాలు ఉండటంతో పూర్తి స్థాయిలో సొల్యూషన్ల నిర్వహణ బీపీఓ కేంద్రాలకు కష్టసాధ్యమైంది. దీంతో గడచిన ఐదేళ్లలో బీపీఓ రంగం 50 శాతం వృద్ధి చెందినప్పటికీ... ప్రస్తుతం సొల్యూషన్ నిర్వహణ కారణంగా తగ్గుముఖం పట్టింది. బీపీఓ రంగ వ్యాపారం ఇలా ఉంటే... టెలీకాం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆటో, హెల్త్‌కేర్ తదితర రంగాల్లో మాత్రం గణనీయమైన అభివృద్ధి కనిపిస్తుండటం విశేషం.